Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు బలపరిచిన మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు చండూరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావుతోపాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు, తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న ర్యాలీలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్యాలయం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది.