Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావు
- టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ లాభం చేసేందుకే అక్కడ టీడీపీ పోటీ చేస్తున్నదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండలానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి హరీశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు.