Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి అరెకటిక సంఘం మద్దతు తెలిపింది. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి హరీశ్ రావును రాష్ట్ర అరెకటిక సంఘం నాయకులు కలిశారు. మంత్రి వారికి గులాబీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హకీంకారి సువేందర్ జీ, ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జహంగీర్ జీ, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కార్ శివప్రసాద్, మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.