Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.15.43 లక్షలు వసూలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రైళ్లలో టిక్కెట్లేని ప్రయాణీకులపై 1,986 కేసులు నమోదు చేసి, రూ.15.43 లక్షలు వసూలు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ప్యాసింజర్ సర్వీస్) కే పద్మజ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. 48 ఎక్స్ప్రెస్ రైళ్లలో 82 టిక్కెట్ తనిఖీ బృందాలు ఈ స్పెషల్ డ్రైవ్లో భాగస్వామలు అయినట్టు తెలిపారు.