Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్ వెంకయ్యనాయుడు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారతీయ సంప్రదాయాలు ఎంతో గొప్పవనీ, ప్రజలందరూ వాటిని ఆచరించి పిల్లలకు కూడా అలవాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్ వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి, దేశభక్తి పెంపొందించుకోవాలనీ, తద్వారా సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన సహస్రదీపాలంకరణ సేవలో వెంకయ్య నాయుడు దంపతులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సద్భావన, సద్బుద్ధి, సదాచారం అలవడతాయని చెప్పారు. ప్రజలందరూ వైభవోత్సవాల్లో పాల్గొని మంచి ప్రేరణతో పురోభివద్ధి సాధించాలని ఆకాంక్షించారు.