Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు పీజీ మెడికల్ అడ్మిషన్లల్లో ఇన్‌సర్వీస్ కోటా రిజర్వేషన్ అమల్లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జీవో 155 ప్రకారం ఇన్‌సర్వీస్ కోటా అమలుకు వీలుగా వారం రోజుల్లోగా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలంటూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవో ప్రకారం గ్రామీణ ప్రాంతంలో మూడేండ్లు, గిరిజన ప్రాంతంలో రెండేండ్లు, ఇతర ప్రాంతాల్లో ఆరేండ్లు సర్వీస్ ఉన్న వైద్యులకు ఇన్‌సర్వీస్ కోటా అమలు చేయాలంటూ నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగికి చెందిన డాక్టర్ దిండు మల్లికార్జున్ ఇతరులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జీవో అమలు చేస్తామంటూ ప్రభుత్వం చెప్పడంతో జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామావరపు రాజేశ్వర్రావులతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.