Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్ నివాళులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కే.వీ.ఆర్.చారి దేశానికి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం సోమాజిగూడలోని జయా గార్డెన్స్‌లో జరిగిన సంస్మరణ సభలో చారికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐ.ఐ.ఎస్.ఈ.ఆర్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీ.ఐ.ఎఫ్.ఆర్) సీనియర్ ప్రొఫెసర్‌గా చారి దేశానికి గొప్ప సేవలందించారని గుర్తు చేశారు. ప్రస్తుత యువ తరానికి ఆయన జీవితం ఆదర్శ ప్రాయమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ వెంకట రమణ, ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ , తదితరులు ఉన్నారు.