Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 15 తర్వాత నిర్వహణకు సన్నాహాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నుమాయిష్‌ను త్వరలో కరీంనగర్లో కూడా నిర్వహించడానికి సన్నాహాలు జరుగు తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్‌ను నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కలిసి సంబంధిత ఏర్పాట్లపై చర్చించారు. 82 ఏండ్ల చరిత్ర కలిగిన నుమాయిష్‌ను ఇప్పటి వరకూ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మాత్రమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్ దాటి వేరే జిల్లాలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో నుమాయిష్ నిర్వహించాలని గతంలో మంత్రి గంగుల ఎగ్జిబిషన్ సొసైటీని కోరారు. ఈ నేపథ్యంలో జనవరి 1 నుండి పిభ్రవరి 15 వరకు హైదరాబాద్‌లో నుమాయిష్‌ను నిర్వహించిన తర్వాత ప్రభుత్వ సహకారంతో కరీంనగర్లో కూడా నిర్వహించే ప్రతిపాదనలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విన్ మార్గం, మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రభాశంకర్, కార్యదర్శి సాయినాథ్, దయాకర్, సభ్యులు వి.జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.