Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి వర్తింపు :
విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యకు సంబం ధించిన ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు వంటి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ప్రమోట్ అయ్యే వివరాలు తెలియడంతో పాటు ఈపాస్ ద్వారా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ విడుదల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. వాటితోపాటు బోధన, బోధనేతర సిబ్బంది విధుల హాజరుకు సంబంధించిన సమాచారం తెలుస్తుందని వివరించారు. వారి సెలవులు గురించి తెలుసుకోవచ్చని పేర్కొ న్నారు. అయితే రాష్ట్రంలో కరోనా మహమ్మారి రాకముందు ఉన్నత విద్యాసంస్థల్లో బయో మెట్రిక్ హాజరు విధానం అమల్లో ఉండేది. కరోనా వచ్చిన తర్వాత ఆ ప్రక్రియను ప్రభుత్వం నిలిపేసింది.
ఇప్పుడు మళ్లీ ఆ విధానాన్ని ప్రవేశపెడుతుండడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఉస్మానియా, జేఎన్టీయూ హైదరాబాద్ వంటి విశ్వ విద్యాల యాల పరిధిలో బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి వచ్చింది. అయితే అను బంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రం ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభు త్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం తో ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, విశ్వవిద్యాల యాలన్నింటిలోనూ విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇంకోవైపు పాఠశాల విద్యాశాఖలో 18 జిల్లాల్లో ఈ విధానం అమ లవుతున్నది. దశలవారీగా అన్ని జిల్లాలకూ విస్తరించాలని విద్యాశాఖ భావిస్తున్నది.