Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ 21 నుంచి 23 తేదీ వరకు.. విజయవంతానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభను డిసెంబర్ 21 నుంచి 23 వరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర అధ్యక్షులు, మహాసభ ఆహ్వాన కమిటీ చైర్మెన్ చుక్క రాములు తెలిపారు. బుధవారం సిద్దిపేటలో జరిగిన సమావేశంలో చుక్క రాములు మాట్లాడుతూ.. సీఐటీయూ రాష్ట్ర మహాసభను మొట్టy ెుుదటిసారిగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభను సిద్దిపేట ప్రజానీకం, కార్మికవర్గం, ప్రజలు, మేధావులు. విద్యా వేత్తలు, వ్యాపారవేత్తలు జయప్రదం చేయా లని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహించి పరిష్కారానికి కృషి చేశామన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే యత్నం చేస్తే పెద్ద ఎత్తున సమర శంఖం పూరించామ న్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి, ఉపాధ్యక్షులు దాసరి కళావతి, బండ్ల స్వామి, పద్మ, జిల్లా సహాయ కార్యదర్శులు చొప్పరి రవికుమార్, తునికి మహేష్, ఇప్పకాల శోభ, జిల్లా కోశాధికారి జి.భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాలనర్సు, భిక్షపతి, రాళ్ల బండి భాస్కర్, లక్ష్మి, కృష్ణమూర్తి, మండల భాస్కర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.