Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, వామపక్షవాది, మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్యను సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకురాలు పశ్య పద్మతో కలిసి వెళ్లి పరామర్శించారు. చుక్క రామయ్య ఆరోగ్యపరిస్థితి గురించి వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. చుక్క రామయ్య చేసిన ముఖ్యమైన సలహాలు, సూచనలు ఉన్నాయని కూనంనేని తెలిపారు.