Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1000 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్ : జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్ ఇండియా రాష్ట్రంలో 400 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఫ్రీడమ్ బ్రాండ్‌కు సంబంధించిన ఈ కంపెనీ హైదరాబాద్ సమీపంలో వంట నూనెల రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పెట్టు బడుల విషయమై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెేటీ రామారావుతో బుధవారం ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరీ భేటీ అయ్యారు. ఈ నిర్ణయాన్ని మంత్రి స్వాగతించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటునకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పసుపు పచ్చ (యెల్లో) విప్లవం ప్రారంభం కానుందని ప్రదీప్ చౌదరీ పేర్కొన్నారు. స్థానికులకు వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలోని అనేక మంది విత్తన రైతులకు మద్దతు లభించనుం దన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడానికి రెండేండ్లు పడుతుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జెమినీ ఎడిబుల్స్ రూ.10,481 కోట్ల రెవెన్యూ సాధించింది.