Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నూతన స్టాండింగ్ కౌన్సిల్‌గా హైకోర్టు సీనియర్ న్యాయవాది పీ శ్రీహర్షారెడ్డి నియమితులయ్యారు. బుధవారం నాడాయన సంస్థ జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కే సూర్య నారాయణ, న్యాయ సలహాదారు లక్ష్మణ్, న్యాయ విభాగం అధిపతి జీ ప్రదీప్‌కుమార్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై ఆయనతో చర్చించారు. కంపెనీకి న్యాయ పరమైన సహాయ సహకారాల్లో విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. సంస్థ తరఫున వివిధ కేసుల్లో న్యాయ స్థానానికి ఇవ్వాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడూ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా వారు స్టాండింగ్ కౌన్సిల్‌కు తెలిపారు. అనంతరం శ్రీహర్షారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థకు తనను స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించినందుకు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. స్టాండింగ్ కౌన్సిల్‌ను కలిసిన వారిలో డిప్యూటీ లా మేనేజర్ మాధవి, సీనియర్ లా అధికారులు కౌశల్, వెంకట్రావ్ ఉన్నారు.