Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యా కమిషనర్‌కు టిప్స్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) కోరింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను బుధవారం హైదరాబాద్‌లో టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త మైలారం జంగయ్య నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంటర్ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వసతులు మెరుగుపర్చాలనీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటర్ విద్యాశాఖకు వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని కోరారు. ఇంటర్ విద్యలో ఈ-ఆఫీస్‌ను ప్రారంభించాలనీ, డీఐఈవోలు, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది సమయం వృధా కాకుండా చూడాలని తెలిపారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారనీ, అతిత్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475 వర్కింగ్ ప్రెసిడెంట్ వస్కుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లక్క స్వామి, కోశాధికారి దుర్గాప్రసాద్, నాయకులు శోభన్ బాబు, మనోహర్, శ్రీనివాస్ రెడ్డి, సంగీత, విశాల, మృత్యుంజయ తదితరులు పాల్గొన్నారు.