Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.903 కోట్ల లావాదేవీలు
-10 మంది నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఢిల్లీ, ముంబయి కేంద్రంగా కొనసాగుతున్న హవాలా కుంభకోణాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు చైనీయులు కాగా, భారత్‌కు చెందిన 8 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం అదనపు సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్, జాయింట్ సీపీ గజారావు భూపాల్, ఏసీపీ ప్రసాద్‌తో కలిసి నగర సీపీ సీవీ ఆనంద్ వివరాలు మీడియా వెల్లడించారు.
ఢిల్లీకి, ముంబయికి చెంది షాహిల్ బజాజ్, సన్నీ, వీరేందర్ సింగ్, సంజేరు యాదవ్, నవనీత్ కౌషిక్, హైదరాబాద్‌కు చెందిన ఎండీ పర్వేజ్, సయ్యద్ సుల్తాన్, మిర్జానదీమ్ బేగ్, చైనాకు చెందిన లెక్, తైవాన్‌కు చెందిన చు చున్-యు ఒక ముఠాగా ఏర్పడ్డారు. పెట్టుబడులు, లాభాల పేరుతో ఆకర్షణీయమైన యాప్స్‌ను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా 'లోక్సామ్ పేరుతో యాప్‌ను' తయారు చేశారు. ఇండూస్ ఇండ్ బ్యాంక్‌లో 'జిందారు టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో బ్యాంక్ అకౌంట్ తెరిచారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా డిపాజిట్లు సేకరిస్తున్న ఈ ముఠా హవాలా రూపంలో విదేశాలకు డబ్బులు తరలిస్తోంది. ఢిల్లీ, ముంబయి, పూణే, దుబారు తదితర దేశాల్లో వివిధ కంపెనీల పేర్లతో దాదాపు 53 బ్యాంక్ అకౌంట్స్ తెరిచారు. ఇదిలావుండగా, ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో హైదరాబాద్ తార్నాకకు చెందిన ఓ వ్యక్తికి గాలం వేసిన ఈ ముఠా రూ.1.6లక్షలు డిపాజిట్ చేయించింది. బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూణేలో వీరేందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. దాంతో చైనా లింక్ వెలుగు చూసింది.
దేశవ్యాప్తంగా వివిధ డిపాజిట్ల ద్వారా వచ్చిన డబ్బులను హవాలా రూపంలో అమెరికాకు, చైనాకు తరలి స్తున్నారు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘిస్తన్న ఈ ముఠా నల్లడబ్బులను హవాలా మార్గంలో దేశంలోని ప్రధాన నగరా లతోపాటు విదేశాలకు తరలిస్తోంది. ఏడు నెలల కాలంలోనే 'రాజన్ మణీ క్రాప్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో 441కోట్లను ట్రాన్స్ఫర్ చేసిన నిందితులు 'కిడ్స్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో మరో రూ.462 కోట్లను ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం రూ.903 కోట్లు ఫ్రాడ్ జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. దాంతో వివిధ బ్యాంక్ అకౌంట్స్‌లో వున్న రూ.1.91కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.