Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వే నిర్వహించాలని గిరిజనుల ఆందోళన
నవతెలంగాణ-గూడూరు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మహబూబాబాద్ అటవీ శాఖ కార్యాలయ పరిధి బొల్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో సర్వే నిర్వహించాలని గ్రామ గిరిజన రైతులు ఆర్డీవో కార్యాలయం ఎదుట పురుగుల మందుతో నిరసనకు దిగారు. నాలుగు రోజులుగా బొల్లపల్లి గ్రామ శివారులో ప్లాంటేషన్ మొక్కలను గ్రామానికి చెందిన కొందరు తొలగించడంతో అటవీశాఖ అసహనం వ్యక్తం చేసింది. ప్లాంటేషన్ తొలగించిన వ్యక్తులపై బుధవారం అటవీశాఖ అధికారులు గూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బొల్లపల్లి గ్రామంలో భూ సర్వే నిర్వహించమని అటవీశాఖ అధికారులు తేల్చి చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలోని వివిధ రేంజ్ పరిధులకు సంబంధించిన అటవీశాఖ సిబ్బంది భారీ మొత్తంలో గురువారం ఉదయం బొల్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గిరిజనులు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. కాగా పోలిస్‌శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. రెవెన్యూ సిబ్బంది సైతం ఆ ప్రాంతానికి చేరుకోగా తక్షణమే సర్వే నిర్వహించాలని, అర్హుల పేర్లుతో ప్రభుత్వానికి నివేదిక అందించాలని పోడు రైతులు డిమాండ్ చేశారు. అటవీ శాఖ అధికారులు సర్వేకు నిరాకరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ ఆర్డీవో కొమురయ్య ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆర్టీవో వెళ్తున్న క్రమంలో గిరిజన రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన ఆయన ప్లాంటేషన్ తొలగించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే భూ సర్వే నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ ఎం. అశోక్‌కుమార్, సీఐ యాసీన్, ఎస్ఐ సతీష్ గౌడ్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.