Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటక శాఖ కార్యదర్శికి హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని హాస్పిటాలిటీ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనీష్దయ్యా నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో హోటల్ రంగం ముందు వరుసలో ఉందని తెలిపారు. మరింత అభివృద్ధి చెందే అవకాశమున్నందున పారిశ్రామిక హోదా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెజినాల్డ్ కార్బెట్ తదితరులు పాల్గొన్నారు.