Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజీఎం కెహెచ్ పట్నాయక్ వెల్లడి
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ రాష్ట్రంలోని పౌల్ట్రీ రంగానికి ప్రధాన మద్దతును అందిస్తుం దని ఆ బ్యాంక్ సీజీఎం కెహెచ్ పట్నాయక్ అన్నారు. ఆ బ్యాంక్ ఆబిడ్స్ హైటెక్ అగ్రి ఫైనాన్స్ బ్రాంచ్ కస్టమర్ మీట్‌ను నిర్వహించింది. ఈ సమా వేశంలో పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పౌల్ట్రీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు. రోజు 10 లక్షల గ్రుడ్ల ఉత్పత్తి జరుగుతుంద న్నారు. ఈ క్రమంలో పౌల్ట్రీ రైతులకు ఎప్పటికప్పుడు నాబార్డు అంగీకారంతో ఇటీవల పెంచిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కెనరా బ్యాంక్ ప్రప్రథమంగా అమలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆ బ్యాంక్ అధికారులు ఎస్ఎస్ విశ్వనాథ్, కనిమోళి, విజరు కుమార్, పౌల్ట్రీ సంస్థల ప్రతినిధులు రవీందర్, శ్రీరామ్, భాస్కర రావు, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.