Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1410 గ్రాముల బంగారం రూ.74 లక్షల విలువ
నవతెలంగాణ-శంషాబాద్
ఎవరికి అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా బంగారాన్ని తరలిం చేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబారు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్న ఈకే - 528 విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు ఇతర ప్రయాణికులతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. వారు అనుమానంగా కనిపించడంతో స్కానింగ్ నిర్వహించగా.. నిబంధనలకు విరుద్ధంగా బంగారం తరలిస్తున్నట్టు తేలింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి నుంచి రూ.74 లక్షల విలువ గల 1410 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.