Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి తెలంగాణ తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండనుంది. చివరి నిమిషంలో ఆపార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు టీటీ డీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బక్కిన నరసింహులు గురు వారం పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దష్టి సారించాలని నిర్ణయించామని తెలి పారు. నాయకులు, కార్యకర్తల అభి ప్రాయాల మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రేపు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఎన్టీఆర్భవన్కు రానున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ నియోజక వర్గాల అధ్యక్షులు, అసెంబ్లీ నియెజక వర్గాల ఇన్చార్జీలు, కోఅర్డినేటర్లు, నియె జకవర్గాల త్రీమెన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు భేటి కానున్నారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష చేయనున్నారు. ఈమేరకు ఆ పార్టీ నేతలకు సమాచారం అందించి నట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు తెలిపాయి.