Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని ఉత్తమ ఫలితాలు సాధించిన 94 మంది మిషన్ భగీరథ అధికారులకు ప్రతిభా అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్టు తొలినాళ్ల నుంచి పనిచేస్తూ మంచి ఫలితాలు తీసుకొచ్చిన అధికారులకు రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశంలో అవార్డులను ప్రధానం చేయనున్నారు. శుక్రవారం వరం గల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మిషన్ భగీరథ కార్యదర్శి స్మీతాసభర్వాల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ జి. కృపాకర్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈనే పథ్యంలో దాదాపు 500 మంది భగీరథ అధికారులు వరంగల్‌కు రానున్నారు. అలాగే ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో మరోసారి సమీక్షించనున్నట్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ జి కృపాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెగ్యులార్టీ కింద కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ అవార్డు ప్రకటించిన విషయం విదితమే.