Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర చర్యలను వ్యతిరేకిస్తూ...:మిడియం బాబూరావు, వేములపల్లి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ... అఖిల భారత స్థాయి ఆదివాసీ, రైతు సంఘాల సమావేశం శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహిస్తున్నట్టు ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ అధ్యక్షులు మిడియం బాబురావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ చైర్మెన్ వేములపల్లి వెంకటరామయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీలకు భూమి హక్కుల కల్పించే అటవీ హక్కుల చట్టం 2006ను నిర్వీర్యం చేస్తూ అటవీ (సంరక్షణ)నియమాలు 2022 వ్యతిరేకిస్తూ పోడుభూములకు హక్కుపత్రాలు ఇవ్వాలనే డిమాండ్లపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఒరిస్సా, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 30 ఆదివాసీ, రైతు సంఘాల ప్రతినిధులు మేథాపాట్కర్, మాధురి, ప్రతిభా షిండే, దయామతి బోర్న్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.