Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పూణేలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిలిట్) నుంచి ఇండియన్ ఆర్మీ అధికారులు గురువారం హైదరాబాద్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణా సంస్థను సందర్శించారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మిషన్ వి హెడ్ సిహెచ్ వెంకటేశ్వరరావు మార్గదర్శకత్వంలో 106 మంది ఇండియన్ ఆర్మీ అధికారులకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణా సంస్థలో సమావేశమయ్యారు. ఆ సంస్థ సామర్థ్య, నిర్మాణ కార్యకలాపాలపై ఆర్మీ అధికారులకు అంతర దృష్టిని అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ లెఫ్టినెంట్ కల్పల్ బిఎస్ సోధి, లెఫ్టినెంట్ కల్నల్ సంజరు సలుఖే, లెఫ్టినెంట్ కల్నల్ అనన్య మొహిలేతోపాటు డివిజన్ సీనియర్ జియాలజిస్ట్లు అమృత్ చంద్రపాత్ర, అన్నీ డాలియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణా సంస్థ డైరెక్టర్ ఎస్పీ భూటియా తదితరులు పాల్గొన్నారు.