Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో దేశం వినాశనం
- రాష్ట్రంలో ఆ పార్టీని నిలువరించేందుకే టీఆర్ఎస్కు మద్దతు : నవతెలంగాణ వర్క్‌షాప్‌లో తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దాని అసలు విశ్వరూపం ఇంకా అందరికీ అర్థం కాలేదు. మతతత్వ ఎజెండాను ప్రస్తుతానికి రుచి చూపిస్తు న్నది. అందులో భాగంగా 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. హిందూత్వ రాష్ట్రమే బీజేపీ లక్ష్యం. మను ధర్మాన్ని నెలకొల్పి, చాతుర్వర్ణ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నది. హిందువులందరికీ అధికారం అనేది వాస్తవం కాదు. మధ్యయుగాల నాటి పాలన తేవడమే బీజేపీ ఎత్తుగడ. అందుకే రాజకీయాల్లో ఆ పార్టీ ఉండడం ప్రమాదకరం. మోడీ పాలనలో దేశం వినాశనం అంచుకి చేరింది. వామపక్ష భావజాలము న్న తెలంగాణలో బీజేపీ ఎదుగుదల ప్రమాదకరం. ఆ పార్టీని నిలువరించడం కోసమే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చాం.'అని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. నవతెలంగాణ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. వక్తగా హాజరైన ఆయన మాట్లాడు తూ బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై తన దృష్టిని కేంద్రీ కరించిందని అన్నారు. కేరళ, తమిళనాడులో ఆ పార్టీ విస్తరణకు అవకాశం లేదన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలూ బీజేపీకే మద్దతు నిస్తున్నాయని వివరించారు. కానీ అక్కడ బీజేపీ ఒక్క సీటూ గెలిచే అవకాశం లేదని చెప్పారు. అందుకే తెలంగాణపై కన్నేసిందన్నారు. వచ్చే సాధారణ ఎన్ని కల్లో గెలవాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉందన్నారు. దాన్ని మార్చేందుకే బీజేపీ మును గోడు ఉప ఎన్నికను తెచ్చిందని చెప్పారు. సాధారణ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ వర్సె స్ బీజేపీ మధ్య పోటీ ఉండేలా కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించడం కోసమే మునుగోడు లో టీఆర్ఎస్కు మద్దతిస్తున్నా మని అన్నారు. బీహార్ లో ఆర్జేడీ-జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక దేశ రాజకీయాల్లో మార్పు లొస్తున్నాయని చెప్పారు. నితీశ్‌కుమార్ వామ పక్షాలతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను కలుస్తున్నారని అన్నారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకి స్తున్నాయని చెప్పారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా వామపక్షాలు, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాల్సిన అవసరముందన్నారు.
సమస్యలకు పరిష్కారం చూపాలి : కె నాగేశ్వర్
పత్రికలనేవి సమస్యలను ప్రచురించడం, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను విమర్శించ డంతోపాటు వాటికి పరిష్కారాలు చూపాలని ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ అన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయ విధానాలను అందించాలని సూచించారు. నిరంతరం పరిశోధిం చాలనీ, శోధించాలనీ, పోటీని గుర్తించాలనీ, సమస్యలను అధిగ మించాలనీ, అంతిమంగా విజయం సాధించాలని విలేకర్లకు చెప్పారు. ప్రజాప్రయోజనం తోపాటు వారికి ఆసక్తి ఉండే వార్తలను అందించా లని కోరారు. వార్తా రచనలో విభిన్నత, వైవిధ్యం ఉండాలన్నారు. కొత్త జనరేషన్ ఆలోచనలకు అను గుణంగా, వారి జీవితానికి ఉపయోగపడేలా పలు విషయాలను అందించాలని సూచించారు. ఇతర పత్రికల్లో ఉన్న అంశాలను ప్రత్యేకతతో ఇవ్వాలనీ, ఇతర అంశాలను సృజనాత్మకతతో అందించాలని కోరారు. నవతెలంగాణ హైదరాబాద్ రీజియన్ మేనేజర్ లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీజీఎం పి ప్రభాకర్, సంపాదకులు ఆర్ సుధాభాస్కర్, జనరల్ మేనేజర్లు భరత్, వెంకటేశ్, రఘు, నరేందర్‌రెడ్డి, శశిధర్, ఆర్ వాసు, బుకహేౌజ్ ఎడిటర్ కె ఆనందాచారి, మొఫషిల్ ఇన్చార్జీ జి వేణుమాధవరావు పాల్గొన్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజాశక్తి, నవతెలంగాణలో వివిధ బాధ్యతల్లో సేవలందించిన హెచ్ఆర్ జనరల్ మేనేజర్ ఎం సుబ్బారావు బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.