Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలాలు, రోడ్డుపై పడిపోయిన కోళ్లు
- దాదాపు 800 కోళ్లను ఎత్తుకెళ్లిన స్థానికులు
నవతెలంగాణ-రామాయంపేట
కోళ్లలోడ్తో వెళ్తున్న డీసీఎం వాహనం సిద్దిపేట జిల్లా రామాయంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్ వద్ద శుక్రవారం బోల్తా పడింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు దొరికిన వాటిని దొరికినట్టు పట్టుకుపోయారు. లక్ష్మాపూర్ గ్రామం నుంచి సిద్దిపేటకు 1200 కోళ్లతో వెళ్తున్న డీసీఎం వాహనం లక్ష్మాపూర్ సబ్ స్టేషన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కోళ్లు పంట పోలాలు, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న లక్ష్మాపూర్ గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్టుగా తీసుకెళ్లారు. సుమారు 800 కోళ్లను మాయం చేసినట్టు డ్రైవర్ తెలిపాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి.