Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్
మెదక్ : ఖాతాదారులకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. మెదక్ ఆటోనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంకు, ఏటీఎంను ఆమె ప్రారంభించారు. అంతకు ముందు బ్రాంచ్ మేనేజర్ విష్టు వర్ధన్, సిబ్బంది అదనపు కలెక్టర్, సర్కిల్ హెడ్ పట్నాయక్‌కు స్వాగతం పలికారు. వినియోగదారుల సహకారంతోనే బ్యాంకు అభివృద్ధి చెందుతుందని పట్నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 366 బ్రాంచీలు, 425 ఏటీఎంలు ఉన్నాయని తెలిపారు. దేశంలో రూ. 20 లక్షల కోట్ల వ్యాపారం కలిగి ఉన్నదన్నారు. డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు కెనరా బ్యాంకు అందిస్తుందని రీజినల్ మేనేజర్ విజరుకుమార్ తెలిపారు. పట్టణంలోని కెనరా బ్యాంకు సేవలతో ప్రజల ఆదరణ చూరగొంటున్నామని బ్రాంచ్ మేనేజర్ విష్టు వర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం సత్యరమేశ్, మణికాంత్, ఫణిందర్, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.