Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 110 అభ్యర్థులు.. 170 నామినేషన్లు దాఖలు
నవతెలంగాణ-చండూర్
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 110 మంది అభ్యర్థులు 170 నామినేషన్స్ దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాధరావు తెలిపారు.
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నాల్గో సెట్ దాఖలు
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తరపున నాల్గోసెట్ నామినేషన్ పత్రాలను అనుచరులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటల వెంకన్న, గుర్రం వెంకటరెడ్డి, అనిల్‌రావు ఎన్నికల అధికారికి అందజేశారు.
నామినేషన్ వేసిన పాల్వాయి స్రవంతి
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి మండలంలోని బంగారిగడ్డ గ్రామం నుంచి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. ఆమె వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నాయకులు పల్లె రవికుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఉన్నారు.