Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌కు పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ కోరింది. ఈ మేరకు మంత్రి కె తారక రామారావును శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు 2015 తర్వాత పదోన్నతులు కల్పించకపోవడంతో పాఠశాలల్లో గుణాత్మక విద్యాబోధనకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. వెంటనే పదోన్నతులు, బదిలీలు, హేతుబద్ధీకరణతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.