Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగపూర్ ఎయిర్లైన్స్ వెల్లడి
హైదరాబాద్: సింగపూర్ - హైదరాబాద్ మధ్య కొత్తగా ఎయిర్ బస్ ఎ350- 900 సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ (ఎస్ఐఎ) వెల్లడించింది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐఎ ఇండియా జనరల్ మేనేజర్ సి యెన్ చెన్ మాట్లాడుతూ.. అక్టోబర్ 30 నుంచి ఈ సేవల ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఇరు ప్రాంతాల మధ్య ప్రతీ గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఎ350 సేవలు కొనసాగుతాయన్నారు. మిగితా రోజుల్లో ప్రస్తుతం నడిపిస్తున్న బి737-8 విమన సేవలు అందు బాటులో ఉంటాయన్నారు. ఈ నెల చివరి నాటికి కరోనాకు ముందు నాటి స్థాయిలో సేవలను అందుబాటులోకి తేనున్నామన్నారు. ప్రస్తుతం దేశంలోని ఎనిమిది నగరాల నుంచి వారానికి 96 విమాన కార్యకలాపాలు అందిస్తున్నామన్నారు.