Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బాబు జగ్జీవన్రాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నారాయణగూడ)లో తెలుగు శాఖాధిపతిగా పని చేస్తున్న యం.రామలక్ష్మి ఉస్మానియా విశ్వవిద్యాలం నుంచి డాక్టరేట్ అందుకుంది. ''తెలంగాణా నవలల్లో స్త్రీల జీవన చిత్రణ'' అనే అంశంపై చేసిన పరిశోధనకు ఓయూ డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రొఫెసర్ మాదిరెడ్డి అండమ్మ గారి పర్యవేక్షణలో రామలక్ష్మి ఈ పరిశోధన పూర్తి చేశారు. డాక్టరేట్ పొందినందుకు బంధువులు, శ్రేయోభిలాషులు రామలక్ష్మికి అభినందనలు తెలిపారు.