Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్రం రైతుల జోలికొస్తే తెలంగాణ మట్టి క్షమించదని రాష్ట్ర పట్టణాభివద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కృషి వల్లే నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్ భూతాన్ని పారద్రోలి, ఆ ప్రాంతాన్ని దేశానికే ధాన్యపు కొండగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పారు. ప్రగతి భవన్లో శుక్రవారంనాడాయన జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలోని ''రైతుల జోలికొస్తే ఊరుకోం'' అనే పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సాగు, తాగునీరు అందిస్తూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలాంటి పథకాలతో గ్రామీణ తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందన్నారు.