Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డాక్టర్ జీఎన్ సాయిబాబా కేసు విషయంలో ముంబాయి కోర్టు వెలువరించిన తీర్పును వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) స్వాగతించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. వెంకట్, ఎం అడివయ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపా చట్టం కింద అరెస్టు అయి నాగపూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న డాక్టర్ జీఎన్ సాయిబాబాతో పాటు ఇతరుల విషయంలో వెలువడిన తీర్పును తక్షణం అమలు చేయాలని కోరారు.అంగవైకల్యం లెక్కకాదంటూ ఒక ప్రొఫెసర్గా ఎదిగిన సాయి బాబాపై మోపిన అభియోగాల నుంచి నిర్దోషులుగా పేర్కొనటం అభినందనీయమని తెలిపారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయ న ఆత్మస్తైర్యంతో ఉన్నారని తెలిపారు. సాయిబాబా విషయంలో 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని కేంద్రం పాటించలేదని పేర్కొన్నారు.