Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు లభించింది. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) 2022 సంవత్సరానికి ఈ అవార్డును ప్రకటించింది. దీనితో పాటు 'లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్' విభాగంలోనూ మరో అవార్డు లభించింది. ఏఐపీహెచ్ ఆరు కేటగీరిల్లో ఎంట్రీలను ఆహ్వానించాయి. 18 దేశాలకు చెందిన నగరాలు తుది జాబితాలో చోటును సంపాదించాయి. అయితే ఆరు కేటగిరీల్లో భారతదేశం నుంచి ఎంపిక చేయబడిన ఏకైక నగరం హైదరాబాద్ కావడం విశేషం. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా నేపథ్యంలో పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌తో పాటు హెచ్ఎండిఏ బందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు రావడం పట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అటవీశాఖ, హెచ్ఎమ్డీఏ అధికారులకు అభినందనలు తెలిపారు. .