Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జోగులాంబ-గద్వాల జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ ప్రస్తుతం నీలోఫర్ ఆస్పత్రి ఆర్ఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. గద్వాల ఇన్ఛార్జ్ డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి.చందునాయక్పై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జీ డిప్యూటీ డీఎంహెచ్ఓగా బదిలీ చేశారు.