Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ (ఫిమేల్) శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు శుక్రవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాల్లో 40 చొప్పున, వరంగల్ లో 20 సీట్లున్నాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 30 ఏండ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు నిబంధనలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ సీట్ల భర్తీని డీఎంహెచ్ఓ సభ్య కార్యదర్శిగా ఉన్న కమిటీ భర్తీ చేయనున్నది. ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 31వ తేదీ వరకు ధరఖాస్తు చేసుకునేందుకు గడువుంది. మరిన్ని వివరాలకు chfw.telangana.gov.inలో చూడవచ్చు.