Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ప్రయివేటీకరణ విధానాలకు ఈ విజయం చెంపపెట్టు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఎస్ఎన్ఎల్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ 47 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. వరుసగా ఏడోసారి గెలిపించినందుకు ఉద్యోగులకు విప్లవాభివందనాలు తెలిపారు. బీజేపీ ప్రయివేటీకరణ విధానాలకు ఈ విజయం చెంపపెట్టు లాంటిందని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో సంస్థ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాల బాటలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులంతా కృషి చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ విధానాలను నిస్సిగ్గుగా బలపర్చిన బీఎంఎస్కు తెలంగాణ సర్కిల్లో ఈసారి అతి తక్కువ ఓట్లు పడ్డాయనీ, ఉద్యోగుల ఆగ్రహానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. సంస్థలో వీఆర్ఎస్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను గ్రహించి సంస్థ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.