Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఇన్చార్జీల ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతల నిమిత్తం మండలాలు, మున్సిపాల్టీల వారీగా ఇన్చార్జీలను తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ప్రకటించినట్టు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మెన్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్(చౌటుప్పల్), ఎమ్మెల్యే రఘునందన్‌రావు(నారాయణపురం), మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి(గట్టుప్పల), మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(మర్రిగూడెం), మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి(నాంపల్లి), మాజీ ఎమ్మెల్యే టి.నందీశ్వర్‌గౌడ్(చండూరు), మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి (మునుగోడు)ను నియమించారని తెలిపారు. చండూరు మున్సిపాల్టీకి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చండూరు మున్సిపాల్టీకి మాజీ ఎమ్మెల్యే ఎమ్.ధర్మారావు ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్నారు. వీరికి ఇద్దరు చొప్పున సహ ఇన్చార్జీలుంటారు.