Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హామీ : ట్రెసా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హామీ ఇచ్చారని ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్ కుమార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ట్రెసా, వీఆర్ఏ జేఏసీ నేతలు మంత్రులను వారిద్దరూ మర్యాదపూర్వకంగా కలిశారు. వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సత్వరమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ శాఖలో వివిధ క్యాడర్ల పదోన్నతులు, ఇతర రెవెన్యూ సమస్యలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏ అమలు, పెన్షనర్ల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రులను కలిసిన వారిలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పి.రాజ్ కుమార్, ఎం.డి. రియాజుద్దీన్, ఎల్.పూల్ సింగ్, ఉపాధ్యక్షులు నిరంజన్ రావు, మాధవిరెడ్డి, కార్యదర్శి మనోహర్ చక్రవర్తి, వీఆర్ఏ జేఏసీ చైర్మెన్ రాజయ్య, కో చైర్మెన్ రమేష్ బహదూర్, ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా, కన్వీనర్ సాయన్న, కో-కన్వీనర్ వెంకటేష్ యాదవ్, ఎమ్డీ.రఫీ, వంగూరు రాములు, శిరీష రెడ్డి, నర్సింహారావు , మాధవ్ నాయుడు, గోవింద్, సునీత, ట్రెసా హైదరాబాద్ అధ్యక్షులు కె రామకృష్ణ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.