Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లా రాజేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ దొంగ ఓట్లను నమోదు చేయించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి చైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ తీరు దొంగే దొంగ..దొంగ అని అరిచినట్టుగా ఉందని విమర్శించారు. ఎన్నికల తేదీని ముందే చెప్పడంతో ఈసీ పూర్తిగా బీజేపీ చేతుల్లోనే ఉందన్న విషయం రుజువైందని చెప్పారు. దొంగ ఓట్లను నమోదు చేసిన కమలం పార్టీ నేతలే కోర్టుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఓట్లను తొలగించిన వారే 40 వేల ఓట్లు తొలగించబడ్డాయని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా కోర్టులో ఓటమి తథ్యమని తెలిసి దానికి కారణాలు చెప్పటానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీఎన్ని కుట్రలు చేసినా రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజ్ గోపాల్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయడం ఖాయమన్నారు. కేంద్ర బలగాలను తేవాలని చూస్తున్నారనీ, ఎన్ని బలగాలుతెచ్చినా సరే... టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.