Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం పార్టీతోనే హైదరా బాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి అయ్యాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచపటంలో నేడు హైదరాబాద్ కని పించడానికి టీడీపీ పరిపాలనే కారణమని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్భవన్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీలో చేరికలు తదితర అంశాలపై ఆ పార్టీ నేతలతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పనిచేసేవాళ్లకే ప్రజల్లో గౌరవం ఉంటుం దన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరడం శుభపరిణామమని తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరా రు. పార్టీ చేసిన అభివృద్ధిపై ప్రచారం చేయాలని సూచించారు. ఫార్టీ ఫండ్ కోసం వాసిరెడ్డి సోదరులు రూ. లక్ష విరాళంగా చంద్ర బాబుకు అంద జేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర పార్టీ సమన్వయకర్త రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.