Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఉత్తమ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొన్నేండ్లుగా గిరిజనులు, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారి భూములను ప్రభుత్వం లాక్కోవడం సరైందికాదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో తండాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగుదారులకు పట్టాలివ్వకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. వారిపై అక్రమ కేసులు పెట్టి గిరిజనులకు జైలుకు పంపిస్తున్నారని చెప్పారు. కొత్త గ్రామ పంచాయితీలకు భవనాలు నిర్మించలేదనీ, దీంతో చెట్లకిందనే పాలన నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు ఇవ్వడంలో సీఎం విఫలమయ్యారని చెప్పారు. బంజారాహిల్స్‌లో బంజారా భవన్ కట్టిండు మంచిదే కానీ గ్రామాల్లో పరిస్థితిని మార్చాలని కోరారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పోడు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పోరాట ఫలితంగా గిరిజనుకు రిజర్వేషన్లు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మంగిలాల్ నాయక్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, జెడ్పీటీసీ చారులత తదితరులు పాల్గొన్నారు.
ఆడబిడ్డను ఓడించేందుకు ఇంత మందా? రేవంత్ ట్వీట్
'ఐదేండ్లు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని సీఎం కేసీఆర్. మునుగోడులో ఒక ఆడబిడ్డను ఓడించేందుకు వందకోట్లతో వేలమంది మందిమాగదులతో దండయాత్ర చేస్తున్నారు' అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడి ట్వీట్ చేశారు. నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామంటూ యాదగిరిగుట్ట ఆలయంపై కేసీఆర్ ఒట్టేసి చెప్పగలరా? అని సవాల్ విసిరారు.
గుత్తా ఎన్నికల కోడ్ ఉల్లఘించారు : నిరంజన్
శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మరొకసారి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్ విమర్శించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని శనివారం ఎన్నికల కమిషన్‌ను కోరారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు 20వేల ఓట్ల మెజార్టీ వస్తుందని ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.