Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు
- ప్రత్యేక సెలవులా? అంటూ ప్రజల ఆగ్రహం
నవతెలంగాణ-వట్పల్లి
సంగారెడ్డి జిల్లాలో మండల కేంద్రమైన వట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెండ్రోజులుగా అధికారులు లేక ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. వివిధ పనులపై వస్తే.. అధికారులెవరూ ఉండటం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం, శనివారం రెండ్రోజులూ ఇదే పరిస్థితి ఉండటంతో.. తహసీల్దార్ కార్యాలయానికి ప్రభుత్వం ప్రత్యేకమైన సెలవు దినాలను ఏమైనా ప్రకటించిందా? అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దారు 20 రోజుల కిందటే 59 జీవోపై విచారణ అధికారిగా పటాన్చెరు మండలానికి వెళ్లారు. తహసీల్ద్దార్, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, చివరికి కార్యాలయ అటెండర్ కూడా విధుల్లో లేకపోవడం గమనార్హం. రెండ్రోజులుగా కంప్యూటర్ ఆపరేటర్, వీఆర్ఏలు ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కాగా, కార్యాలయానికి రాకపోవడంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన పట్టా పాసుబుక్కుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లామని చెప్పారు. కార్యాల యంలో ఆర్ఐను అందుబాటులో ఉండాలని చెప్పామని, అయితే ఆయన మంచిర్యాల తాండా పరిధిలో అటవీశాఖ అధికారులు చేపడుతున్న సర్వే వద్దకు వెళ్లి ఉండొచ్చన్నారు.