Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:సామాజికం గా వెనుకబడిన వారికి సాయం అందిం చడంలో ఎప్పుడూ ముందుండే ఎస్బిఐ లేడిస్ క్లబ్ హైదరాబాద్ శనివారం ఉచిత వైద్య పరీక్షల క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ అధ్యక్షురాలు నుపూర్ జింగ్రాన్ ఆధ్వర్యంలో కోటిలోని లోకల్ హెడ్ ఆఫీస్, సికింద్రాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌ల్లో హెల్త్ చెకప్ క్యాంప్‌ను నిర్వహించారు. హౌస్ కీపింగ్ స్టాఫ్, డ్రైవర్లు తదితరులకు గైనకాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లతో ఉచిత పరీక్షలు అందించారు. రక్తపోటు, షుగర్, ఇసిజి తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా ఔషదాలు అందించారు. అదే విధంగా నారాయణ్ పేట్, పోచంపల్లి, గద్వాల్‌లోని నేతన్నలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. స్థానికంగా తయారు చేసిన చీరలు ఇతర వస్త్ర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నుపూర్ జింగ్రన్ సూచించారు.