Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇతరుల ప్రాణాలను నిలబెట్టేందుకు అవయవాల దానానికి ప్రజలు ముందుకు రావాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్లో ఆయే జిందగీ సినిమా ప్రదర్శనను ఆమె తిలకించారు. సినిమా యూనిట్ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందన్నారు. ఒక డాక్టరుగా అవయవదానం ప్రాధాన్యత తనకు తెలుసని చెప్పారు. చీకటిగా మారిన వారికి తిరిగి జీవితాన్నివ్వడమే అవయవదానమని అభివర్ణించారు. అయే జిందగీ సినిమా ప్రజా చైతన్యానికి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా అనేక మందికి స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.