Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడ నువ్వేం చేశావ్.. : రఘునందన్‌రావును నిలదీసిన స్థానికులు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగలు తప్పడం లేదు. మొన్న నాంపల్లి మండలం తుంగపాడులో, నిన్న నారాయణపురం మండలం మర్రిగూడెంలో.. తాజాగా శనివారం మండలంలోని గుజ్జ, కోతులపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ''కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలుపొంది సకల సౌకర్యాలు అనుభవించి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు బీజేపీకి అమ్ముడు పోతావా..? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నావు..? గో బ్యాక్ రాజగోపాల్ రెడ్డి'' అని నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచార రథానికి అడ్డు తగిలారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలకు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
దుబ్బాకలో నీవు ఎంత అభివృద్ధి చేశావు:కోతులాపురంలో రఘునందన్‌రావును నిలదీసిన గ్రామస్తులు
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ నారాయణపురం మండలంలోని కోతులాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు నిరసన వ్యక్తమైంది. గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీశారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నావ్.. 'దుబ్బాకలో గెలిచి నీవు ఎంత అభివృద్ధి చేసావు.. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే ఎంత అభివృద్ధి చేస్తాడు .. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేశాడు' అని రఘునందన్‌రావు ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో బీజేపీి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్న తోపులాట జరిగింది. పోలీసుల జోక్యం వల్ల సద్దుమణిగింది.
తన్నండి రా.. అంటూ కార్యకర్తలను ఉసిగొల్పిన రాజగోపాల్ రెడ్డి
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాల్‌రెడ్డి శనివారం సాయంత్రం సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడు తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. అంతేకాకుండా గ్రామంలోకి ప్రవేశించకుండా వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి ఆవేశానికి గురయ్యారు. '15 రోజుల నుంచి వీడి చేష్టలు గమనిస్తున్నా.. వాన్ని పట్టుకొని తన్నండ'ి అంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్తను ఉద్దేశించి బీజేపీ కార్యకర్తలను ఉస ిగొలిపారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బందోబస్తులో ఉన్న ఏసీపీ, మరో ముగ్గురు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది జోక్యం చేసుకొని కార్యకర్తలను చెదరగొట్టారు. అనం తరం రాజగోపాల్ రెడ్డి ఉద్రేకంగా ప్రసం గించారు.