Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
నవతెలంగాణ-పుల్కల్
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో గల సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 19467 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో ప్రాజెక్టు అధికారులు 9, 11, 6 గేట్ల ద్వారా 32,232 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.350 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 29.917 టీఎంసీలు ఉన్నది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నీటిని దిగువకు వదిలారు. దిగు వన ఉన్న మంజీర పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండా లని అధికారులు సూచించారు. ముఖ్యంగా పశువుల కాపరులు, మత్స్య కారులు, రైతులు మంజీర తీరం వైపు వెళ్లొద్దన్నారు. ఈ నీటి ప్రవాహం 36 గంటల పాటు కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.