Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్పై గంటపాటు చర్చ
నవతెలంగాణ - బెంగళూరు
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటును ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి మద్దతు ప్రకటించిన కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ) నిర్ణయం పట్ల జనతాదళ్ (ఎస్) రథసారథి, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం బెంగళూరులో ఆయనతో కేఆర్టీఏ వ్యవస్థాపకులు, అధ్యక్షు డు సందీప్ మఖ్తల, సెక్రటరీ జనరల్ ఈవీ సతీష్‌తోపాటు ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఆరోగ్యం సహకరించకపోయినా బీఆర్ఎస్పై దాదాపు గంటపాటు వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలం గాణ ఉద్యమంతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేఆర్టీఏ అధ్యక్షుడు సందీప్ మఖ్తల, సెక్రటరీ జనరల్ ఈవీ సతీష్ మాట్లాడుతూ కేఆర్టీఏకు మాజీ ప్రధాని దేవేగౌడ, జేడీ (ఎస్) నాయకులు ఆది నుంచి అండగా నిలుస్తున్నారని వివరించారు. రాబోయే కాలంలో నిజాం హైదరాబాద్ రాష్ట్ర ంలోని ప్రస్తుత కర్ణాటక ప్రాంతంలో కేఆర్టీఏను విస్తరించనున్నట్టు వెల్లడించారు.