Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఆయా కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా నలుగురు అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ జాయింట్ డైరెక్టర్‌గా వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ సివిల్ సర్జన్ డాక్టర్ కె.వి.రమేశ్, మౌలిక సదుపాయాలు, పరికరాల డిప్యూటీ డైరెక్టర్‌గా మలక్‌పేట సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్.జయరామ్ రెడ్డి, మానవ వనరుల జాయింట్ డైరెక్టర్ గా వనస్థలిపురం సివిల్ సర్జన్ డాక్టర్ టి.వినరు కుమార్, సర్జికల్స్, కన్జూమర్స్, బ్లడ్ బ్యాంకులు, డయాగస్టిక్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ ఎం.మల్లికార్జున్ ను డిప్యూటేషన్‌పై నియమిస్తూ ఆదేశించారు.