Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీబీ రోగులకు నిరాటకంగా చికిత్సను కొనసాగించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఆమె దత్తత తీసుకున్న వంద మంది రోగులకు కనీసం నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను శనివారం గవర్నర్ రాజ్‌భవన్‌లో పంపిణీ చేశారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా టీబీని జయించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా టీబీపై అవగాహన పెంచే కరపత్రాలను ఆమె విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులతో పాటు హెలియాస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రవికుమార్ గౌడ్, రాజ్ భవన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించండి
గవర్నర్‌కు జేఎన్టీయూ కాలేజీల విద్యార్థుల వినతి
తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జేఎన్టీయూ పరిధిలోని కళాశాలల విద్యార్థులు గవర్నర్‌ను కోరారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పీ.జే.అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని శనివారం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ స్పేస్ ద్వారా విద్యార్థులు, యువతతో ముచ్చటించారు. సంబంధిత యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి విద్యార్థుల సమస్యలు తొందరగా పరిష్కరించేలా చూస్తానని తమిళిసై హామి ఇచ్చారు.
రాజకీయ పార్టీతో సమావేశం కాలేదు
సామాజిక మాధ్యమాల ద్వారా ఒక రాజకీయ పార్టీతో గవర్నర్ సమావేశమయ్యారంటూ వస్తున్న పుకార్లను రాజ్‌భవన్ ఖండించింది. ఆధారరహితంగా గవర్నర్‌పై ఆరోపణలు చేయడం తగదంటూ శనివారం రాజ్ భవన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.