Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన పీఈసెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 19 నుంచి 26 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌తో పాటు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఈనెల 26, 27 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల (ఎన్సీసీ, సీఏపీ, వికలాంగులు, స్పోర్ట్స్)కు ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని పేర్కొన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముందని వివరించారు. వచ్చేనెల రెండున తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. అదేనెల మూడు నుంచి 11 వరకు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనతోపాటు ట్యూషన్ ఫీజు చెల్లింపు ఉంటుందని పేర్కొన్నారు. 14 నుంచి బీపీఈడీ, డీపీఈడీ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమవు తాయని వివరించారు. ఇతర వివరాలకు ఈనెల 18 నుంచి http://pecetadm.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది పీఈసెట్‌కు 3,657 మంది దరఖాస్తు చేయగా, 2,360 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2,264 (95.93 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీని వాసరావు, పీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్‌బాబు, కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.